Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని పట్వారి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీతారామ కళ్యాణ మండపానికి ములకపల్లి మండలానికి చెందని తాండ్ర నారాయణరావు (టీఆర్ఎస్), ట్రస్టు చైర్మెన్ తాండ్ర వెంకటేశ్వరరావు రూ.10 లక్షలు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా కమిటీకి మంగళ వారం అందజేశారు. వెంకటేశ్వరరావు అమెరికాలో చికాగో కేంద్రంగా ఫల్‌క్రమ్ గ్లోబల్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్వరరావు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో రూ.25 లక్షలతో 108 అంబులెన్స్‌ను రాష్ట్ర పురపాకల, రవాణ శాఖా మంత్రులు కేటీఆర, పువ్వాడ అజరు కుమార్ అందజేశారు. ఈ అంబులెన్స్ ప్రస్తుతం ములకపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో సేవలందిస్తోంది. ఇప్పటికే ములకపల్లి మండలంలో పలు సేవా కార్యక్రమాలు రూ.లక్షలు వెచ్చించి విరివిగా ట్రస్టు ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు నిర్వహి స్తున్నారు. పలువురు పేద విద్యార్థులకు సైతం చదువులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. కళ్యాణ మండప నిర్మాణానికి విలువైన స్థలాన్ని ప్రజోపయోగార్థం చెలికాని సూరిబాబు, వెంకట్రావు, సత్యంబాబు సోదరులు వితరణగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వర రావు, చెలికాని సూరిబాబు, కోటగిరి మోహనరావు, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, కొయ్యల అచ్యుతరావు, మొగిలి క్రిష్ణ, జారే ఆదినారాయణ, సీతారామ్, దుర్గా ప్రసాద్, కోటగిరి రామక్రిష్ణ, ప్రసన్న, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.