Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాద్రిని స్వచ్ఛ టౌన్‌గా తీర్చిదిద్దాలి
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-భద్రాచలం
వర్మి కంపోస్ట్ తయారీకి సంబంధించిన డంపింగ్ యార్డ్ మార్చి 31 నాటికి పనులు త్వరితగతిన పూర్తి చేసి ఏఫ్రిల్ 1 నుండి వర్మి కంపోస్ట్ తయారయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం భద్రాచలంలోని మానబోతుల చెరువు దగ్గర ఉన్న స్థలమును ఆయన పరిశీలించి, మాట్లాడారు. వర్మి కంపోస్టు సంబంధించిన మిషనరీ, తడి, పొడి చెత్త వేరు చేయడానికి సంబంధించిన ఆర్గానిక్ ప్రెషర్ హైడ్రాలిక్ డ్రెస్ మిషన్ తొందరగా తెప్పించాలని ఆయన అన్నారు. అలాగే కరెంటుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కోసం విద్యుత్ అధికారులను సంప్రదించి వెంటనే ఏర్పాటు చేయించాలని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్లకు తడి చెత్త, పొడి చెత్త సేకరించడానికి అవస రమైన శిక్షణ అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ఐటీడీఏ నుండి డంపింగ్ యాడ్ వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేనందున వర్మీ కంపోస్ట్ తయారీ కొరకు చెత్త తీసుకొని వచ్చే వాహనాలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు సౌకర్యం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తనకు పంపించాలని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలో శానిటేషన్ చెత్త సేకరించ డానికి కొత్తగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు టీఎస్ ఆగ్రో కంపెనీ నుండి కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని ఈవోకు ఆయన సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రం చుట్టూ పెన్సింగ్ తొందరగా ఏర్పాటు చేయాలని సంబంధిత ఏఈకి ఆదేశించారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇటు వంటి చెత్త గోదావరిలోకి కలవకూడదని మొత్తం చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించాలని ఆయన అన్నారు. భద్రాచలంకు సీతారామ చంద్ర స్వామి దేవస్థానం ఎంత ముఖ్యమో భద్రాచలం పట్టణం శుభ్రంగా ఉండడానికి చెత్తను సేకరించి డంపింగ్ యాడ్‌కు తరలించడం అంత ముఖ్యమని ఆయన అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంబంధిత పంచాయతీ రాజ్ ఈఈ, డీఈ, ఏఈలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ వర్మి కంపోస్ట్ తయారీకి సంబంధించిన పనులు ఆలస్యం చేయకుండా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయన అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో పని చేసే వర్కర్లతో మాట్లాడి వారు చేసే పనుల గురించి అడిగి తెలుసుకొని గ్రామ పంచాయతీకి వచ్చే ప్రజలకు వారికి సంబంధించిన పనులు చాలా బాధ్యతగా చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవిన్యూ గెస్ట్ హౌస్‌కు ఏమైనా రిపేర్లు ఉంటే తనకు ప్రతిపాదనలు పంపించాలని ఆయన అన్నారు. అలాగే టూరిజం స్పాట్ కోసం ప్రస్తుతం ఇచ్చిన స్థలం కంటే అదనంగా రెండెకరాలు అప్పగించడానికి భూమిని గుర్తించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నవి గుర్తించి తనకు ప్రతిపాద నలు పంపించాలని తహసీల్దార్‌కు ఆదేశించారు. భద్రాచలాన్ని టెంపుల్ సిటీ గానే కాకుండా స్వచ్ఛ టౌన్‌గా తీర్చిదిద్ద డానికి ప్రతి ఒక్క అధికారి శ్రద్ధ చూపించాలని దానివలన భద్రాచలంకు ఇతర రాష్ట్రాల నుండే కాక జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూ చించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ మంగ్య, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, గ్రామ పం చాయతీ ఈఓ వెంకటేశ్వరరావు, డీఈ రాజేశ్వర రావు, ఏఈఓలు మంగ్య నాయక్, శ్రీరామ్, డీఎల్పీవో పవ న్, ఆర్ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.