Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో డివిజన్ కార్యాలయంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్ అసోసి యేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బి.గౌతమ్ అధ్వర్యంలో మంగళ వారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిజనల్ సెక్రటరీ కె.ఉదరు రత్నకుమార్ మాట్లాడుతూ టీఎస్ ట్రాన్స్ కో ఇచ్చిన జివో నెంబర్ 62 వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మెరిట్ కమ్ సినియారిటీని కూడా ఖండిస్తూ,దీని ప్రకారం కాకుండా రిజర్వేషన్ ప్రకారంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. యాజమాన్యం నిర్ణయం వెనుకకు తీసుకోక పోతే ఉద్యమం ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు కోలగాని రమేష్, బెల్లీ.వెంకటరాజు, డివిజన్ బాధ్యులు తేజావత్ రమేష్, ఆది నారాయణ, సీతారాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.