Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జనజీవన స్రవంతిలో కలవండి
అ సీఐ అశోక్
అ మిలీషియా సభ్యురాలు లొంగుబాటు
నవతెలంగాణ-చర్ల
నిషేధిత మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.అశోక్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. సరిహద్దు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పెద్ద ఉట్ల గ్రామానికి చెందిన నిషేధిత మావోయిస్ట్ పార్టీ పూజారి కాంకేర్, ఆర్పిసి మిలీషియా సభ్యురాలు తాతి చిలక తండ్రి రామయ్య వయస్సు 18 సంవత్సరాలు ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్' ఏ- కంపెనీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈమె గత మూడు సంవత్సరాలుగా పూజారి కాంకేర్ రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ (ఆర్పిసి) మిలీషియా సభ్యురాలుగా పనిచేస్తుందన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం మైనర్ బాలికగా ఉన్నప్పుడు పూజారి కాంకర్ ఆర్పిసి సభ్యులు నూపా లక్మా కామయ్య, సహదేవ్ మొదలగు వారు బెదిరించి బలవంతంగా మిలీషియాలో చేర్పించారని ఆయన తెలిపారు. మావోయిస్ట్ పార్టీ నాయకులు, దళ సభ్యులు ఆదివాసీ గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ, యువతీ యువకులను, మైనర్ బాలబాలికలను మిలీషియాలో, దళాల్లో బలవంతంగా చేరిపిస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటూ, ఆదివాసీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. మెరుగైన జీవనం గడపటం కోసం మావోయిస్ట్ పార్టీకి చెందిన దళ సభ్యులు, ఆర్పిసి సభ్యులు, మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఆర్పిఎఫ్ అధికారి సీతా సింగ్, చర్ల ఎస్సైలు రాజు వర్మ, వెంకటప్పయ్య లు పాల్గొన్నారు.