Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.బాలమల్లేశం
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి, అగ్రిగోల్డ్ బాధితుందరికీ డబ్బులను చెల్లించాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.బాలమల్లేశ్ కోరారు. మంగళవారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవనంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్.బాలమల్లేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ఫిబ్రవరి నెలలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం, జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి, మార్చి మొదటి వారంలో 'చలో హైదరాబాద్' కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యను పోరాటం ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. సిపిఐ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి యర్రా బాబు మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఖమ్మం గిరిప్రసాద్ భవనంలో జరిగే సమావేశానికి అగ్రిగోల్డ్ ఏజెంట్లు, భాదితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కోశాధికారి మద్దినేని.రామరావు, కార్యవర్గ సభ్యులు నల్లబోలు.సునీత, దెయ్యాల రామమల్లేశం, తదితరులు పాల్గొన్నారు.