Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్.విపి గౌతమ్
నవతెలంగాణ-కామేపల్లి
పండితాపురం పశువుల సంతను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు. సంతలో మంచి నీటి కుళాయి తిప్పి చూడగా నీళ్లురాలేదు సంత ఆవరణలో లైట్లు లేక పోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండవసారి చెప్పించుకోవడం బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కొమ్మినేపల్లి గ్రామంలోని హైస్కూల్ ను తనిఖీ చేయగా ఆపాఠశాలలో 227మంది విద్యార్థులకు 20 మంది పాఠశాలకు హాజరు కావడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండలస్థాయి అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.