Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద ప్రజలకు అన్యాయం
- కేంద్ర బడ్జెట్‌పై పొన్నం విమర్శలు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో 2022-2023 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. మంగళవారం ప్రవేశపెట్టిన పదవ బడ్జెట్టు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేది గాను, పేద ప్రజలకు అన్యాయం చేసిందిగా ఉందని ఈ బడ్జెట్‌ను సిపిఎం ఖండిస్తుందని, వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెటు రైతాంగానికి అనుకూలంగా ఏ ఒక్క చర్య బడ్జెట్లో కనపడలేదని, ఈ మధ్యకాలంలో రైతులకు రైతు ఉద్యమానికి క్షమాపణ చెప్పిన మోడీ, రైతులకు అనుకూలమైన బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. ఉన్నత వర్గాలు ఉపయోగించే బంగారం, వజ్రాలు, డైమండ్, ఆ భరణాలు వంటి వాటిపై సుంకం తగ్గించిందని బంగారు కొనుగోలు చేయలేని పేద ప్రజలు సామాన్యులు వాడే రోల్డ్ గోల్డ్ పై ధరలు పెంచారని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు అనుకూలంగా వారి ఆర్థిక స్థాయిని పెంచే విధంగా బడ్జెట్ లేదని పేద ప్రజలకు మాటలు గాను ఉన్నత వర్గాలకు మూటలుగాను బడ్జెట్ వుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు మాదినేని రమేష్, మండల పార్టీ కార్యదర్శి దివ్వెల వీరయ్య పాల్గొన్నారు.