Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో రాజకీయ జోక్యం, ఫైరవీకార్ల వల్ల అధికారులు తమ విధులు నిర్వహించటంలో పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియూ) రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు ఆన్నారు. సింగరేణి కార్మికులపట్ల న్యాయంగా వ్యవహారించ వలసింది పోయి డిప్యూటేషన్ విషయంలో అర్హత గల సీనియర్లకు అవకాశం కల్పించకుండా జూనియర్లకు డిప్యూటేషన్‌పై బదిలీ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇల్లందు ఏరియాలో పనిచేసి దిగిపోయిన అనంతరం తమ వారసులకు డిపెండెంట్ ఉద్యోగంతో కొత్తగూడెం ఏరియా పివికే-5లో పనిచేస్తున్న వారు ఇల్లందు నుండి డ్యూటీ చేయుటకు ఇబ్బందులు పడుతున్నారని, తమ సొంత ఏరియా ఇల్లందు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసుకోగా తమ విజ్ఞప్తి మేరకు ఆఫీస్ ఆర్డర్ వచ్చినా కూడా రిలీవ్ చేయకుండా నిలుపు దలచేసి రాజకీయ పలుకుబడి గలవారికి డిప్యూటేషన్‌పై ఇల్లందుకు పంపించడం అన్యామన్నారు. ఇట్టి విషయంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా బదిలీ కోరినవారిని వివక్షత చూపకుండా పారదర్శకంగా తక్షణమే రిలీవ్ చేయాలని, కార్మికుల పట్ల సమ న్యాయ ధోరణి అవలంభించాలని అధికారులకు సూచించారు.