Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రాజ్యాంగాన్ని మార్చాలని రాష్ట్ర ముఖ్య మంత్రి అనడం సిగ్గుచేటని, వెంటనే డాక్టర్ బీఆర్.అంబేధ్కర్కు, ప్రజలకు బహిరంగంగా క్షమాపన చేప్పాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న డిమాండ్ చేశారు. గురువారం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తు జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ స్థానిక బస్టాండ్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడారు. ఈ కార్యక్రమం జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శులు ఎస్కె. షబానా, పొదిలి జ్యోతి, బోడ దివ్య, తేజ కమల, పినపాక నియోజకవర్గం బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, అశ్వరావుపేట మహిళా మండల ప్రెసిడెంట్ మరియమ్మ, చండ్రుగొండ మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కృష్ణవేణి, దమ్మపేట మండల మహిళా అధ్యక్షురాలు ఏసు మణి, మణుగూరు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య, మణుగూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు రమణ, ములకలపల్లి మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు పద్మ, బూర్గంపాడు మండల మహిళా అధ్యక్షురాలు గోనే రేణుక, ప్రధాన కార్యదర్శి సుగుణ, ఇల్లందు పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇంద్ర పాల్గొన్నారు.