Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అంబేద్కర్ మెమోరియల్ యూత్ క్రీడల ప్రారంభోత్సవంలో
అ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య...
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రంపంచంలో ఎవ్వరూ అభ్యసించని ఉన్నత చదువులు చదివిన బిఆర్ అంబేద్కర్ రచించిన భారతరాజ్యాంగాన్ని రద్దు చేయాలని అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంబేద్కర్ వాదులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. గురువారం సీతానగరం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్ల, దుమ్ముగూడెం మండలాల అంబేద్కర్ 2వ మెమోరియల్ క్రికెట్ క్రీడలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతానగరం అంబేద్కర్ యూత్ సభ్యులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మెమోరియల్ పేరిట క్రీడలు నిర్వహించడం పట్ల యూత్ సభ్యులను అభినందించారు.ప్రతి క్రీడాకారుడు క్రీడా సూర్తితో, స్నేహబావంతో మెమోరియల్ క్రీడలను విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్బంగా అంబేద్కర్ యూత్ సభ్యులు ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలకిë, వార్డు సభ్యురాలు జిలకర స్వర్ణలత, మండల కాంగ్రెస్‌పార్టీ అద్యక్షులు లంకా శ్రీనివాసరావు, ఏ బ్లాక్ అద్యక్షులు బొలిశెట్టి రంగారావు, బి బ్లాక్ అధ్యక్షులు రమేష్ గౌడ్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.