Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రామాలలో భయానక వాతావరణం సృష్టించడం దారుణం
అ పోడు భూములపై ప్రభుత్వం వైఖరిని తిప్పికొట్టాలి
అ విలేకర్ల సమావేశంలో నాలుగు విప్లవ పార్టీల పిలుపు
నవతెలంగాణ-ఇల్లందు
2014, 2019 ఎన్నికల సందర్భంలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లు గడిచినా పట్టాలు ఇవ్వకుండా గిరిజనులను మోసం చేస్తున్నాడని ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టాలని నాలుగు విప్లవ పార్టీలు పిలుపునిచ్చాయి. న్యూడెమోక్రసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రన్న వర్గాల రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే.గోవర్ధన్, ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవునూరి మధు, జనశక్తి పార్టీ నాయకులు కొమరయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనేక దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, దరఖాస్తులు చేసుకున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కందకాలు తవ్వడం, భూములను ఆక్రమించుకోవడం అత్యంత దుర్మార్గమైనదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసి పేదల భూములను ఆక్రమించుకుని కార్పొరేట్ సంస్థలకు కాపలాదారుగా మారిందని ఆరోపించారు. ఆదివాసీ ప్రాంతాల్లో పోలీస్, ఫారెస్ట్ అధికారులు గ్రామాలలో భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఫలితంగా కుంజ రామయ్య లాంటి అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల మరణాలకు కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు సీతారామయ్య, యదల్లపల్లి సత్యం, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, తుపాకుల నాగేశ్వరరావు, పిట్టల సత్యం, సైదులు, మోకాళ్ళ రమేష్, బి తదితరులు పాల్గొన్నారు.