Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి బొగ్గు బావుల ప్రయివేటీకరణకు నిరసనగా గురువారం ఇల్లందులో మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షులు ఎస్ . రంగనాథ్ మాట్లాడారు. లాభాలలో ఉన్న సింగరేణినీ దీనితో పాటు ఎల్ఐసి, ఏయిరిండియా లాంటి సంస్థలను ప్రయివేట్ వారికి కట్టబెట్టారు అంటూ కార్మికుల నిరసన వ్యక్తం చేశారు. లాభాలలో ఉన్న సింగరేణి పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని అన్నారు. గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు అడగగానే అక్కడి గనులను వేలంపాట నుండి తప్పించిన మోడీ, తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చిపుస్తున్నోరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌస్, సంజీవరావు, కోటయ్య, బాబురావు, రాజయ్య శ్రీను, సివిల్ నుండి అశోక్,చంద్రయ్య, బి.సరజు, వర్క్ష్ షాప్ నుండి కోటేశ్వరరావు పాల్గొన్నారు.