Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకులపల్లి
టేకులపల్లిలో జరుగుతున్న టేకులపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ని బిఎస్పి నియోజకవర్గ అధ్యక్షుడు బాదావత్ ప్రతాప్ టాస్ వేసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సహనము కలిగి ఉండాలని అన్నారు. అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ సాయి, తేజావత్ రవి, క్రీడాకారులు పాల్గొన్నారు.