Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణుగూరు: యువత మత్తుకు బానిసలు కాకూడదని, దీని వలన దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని, నేటి విద్యార్థులు రేపటి ఉత్తమ పౌరులుగా తయారు కావాలంటే విద్యార్దులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనీవాస్ తెలిపారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్దులకు అవగాహానా సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనీ వాస్, ఎక్సైజ్ శాఖ సిఐ రాంమూర్తి మాట్లాడుతూ మాదకద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్, అబ్దుల్ కరీం.సతీష్, రామతిరుపతి, తదితరులు పాల్గొన్నారు.