Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సత్వరమే భూమి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలి
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
అటవీ భూములకు ప్రత్యామ్నయ భూములు అప్పగించక పోవడం వల్ల రహదారుల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నదని, సత్వరమే సీఏ భూమి అప్పగించు విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రెవిన్యూ, పోలీస్, రహదారులు భవనాలు, బిటిపిఎస్, సింగరేణి, ఎల్‌అండ్‌టి, రైల్వే, సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల పథకం, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ అధికారులతో భూసేకరణ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కేసులకు ఇంటీరియం రిపోర్టులు పంపాలని చెప్పారు. బిసీ, ఎస్సి, ఎస్టీ కమిషన్లు వద్ద కూడా కోర్ట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సిఏ భూమి అప్పగించక పోవడం వల్ల అటవీ అధికారులు రహదారుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని చెప్పారు. అటవీ అనుమతులు ఇవ్వక పోవడం వల్ల నిర్మాణం ఆగిన రహదారుల వివరాలు అందజేయాలని చెప్పారు. సిఏ భూమి అప్పగించక పోవడం వల్ల పనులు చేయడానికి జాప్యం జరుగుతున్నదని చెప్పారు. ప్రాజెక్టులకు భూమి అప్పగించి పరిహారం తీసుకున్న మండలాల్లో పనులకు ఆటంకం కలిగిస్తే రెవిన్యూ, పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు చెప్పారు.
రహదారులు చాలా ముఖ్యం...ఎస్పీ సునీల్‌దత్
అభివద్ధికి రహదారులు చాలా ముఖ్యమని, పరిహారం తీసుకొని పనులు జరగకుండా ఆటంకాలు కల్పించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీల్ దత్ హెచ్చరించారు. రహదారులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, సీతమ్మ సాగర్ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, ఎల్‌అండ్‌టి డిజిఎం రజనీష్ చౌహన్, రోడ్లు భవనాల శాఖ ఈఈ భీంమ్లా, బిటిపిఎస్ సీఈ బాలరాజు, ఆర్డిఓ స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.