Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యంఆర్పి ధరలకు అందుబాటులో లేని కొన్ని మద్యం బ్రాండ్లు-డివైఎఫ్ఐ
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్ విచ్చలవిడిగా సాగుతోం దని, వైన్ షాపులలో అందుబాటులో లేని మద్యం, బెల్టు షాపుల్లో లభ్యం అవుతుందని, మద్యం సిండికేటుగాళ్లు మద్యం ప్రియుల జేబులు లూటీ చేస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాలంగి హరికృష్ణ, జిల్లా కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు. గురువారం స్థానిక మంచికంటి భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్ వ్యవస్థను ఏర్పాటుచేసి నడుపుతూ సామాన్య మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తున్నారని, యంఆర్పి కంటే అధిక ధరలకు విక్రయిస్తూ సిండికేట్ మద్యం మాఫియా జరుగుతున్నప్పటికీ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు మత్తు నిద్రలో ఉన్నారని ఆరోపించారు. ఇంత జరగడానికి సిండికేట్ మధ్యం మాఫీయాకు జిల్లా ఎక్సైజ్ అధికారులు సహకారాన్ని అందిస్తున్నరాని ఆరోపించారు. యంఆర్పి ధరలకు మద్యం అమ్మాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున వాటి ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.