Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
చెడుపై పోరాటం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏసీపీ స్నేహ మోహార అన్నారు. వైరా మండల కేంద్రంలోని యన్విఎస్ గార్డెన్ నందు మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జే వసంత్ కుమార్ అధ్యక్షతన మండల ప్రజా ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సమాజంలో యువతరం బాధ్యత ఎంతో ముఖ్యమైందని యువత చేతిలోనే దేశ భవిష్యత్తు దాగివుందని అటువంటి యువత నేడు చెడు వ్యసనాలకు అలవాటు పడిన వక్రమార్గంలో నడుస్తూ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యువతరం చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు, యువకులు సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సూత కాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మండల విద్యాశాఖ అధికారి కే వెంకటేశ్వరరావు, మండల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.