Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుందని మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లా రోజ్ లీ నా ఆధ్వర్యంలో రూ.14.20 లక్షలతో నూతనంగా నిర్మించిన లెటెస్ట్ మోడల్‌గా వ్యాక్యూమ్ డివాటరీడ్ ఫ్లోరింగ్ సిసి రోడ్డును మంత్రి పువ్వాడ అజరు కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. నగర మేయర్ పునుకోల్లు నీరజ, సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్ చేతుల మీదుగా సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరి, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి, నగర కార్యదర్శి పాల్వంచ కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు అమరగాని వెంకన్న, డివిజన్ కార్యదర్శి దుర్గారావు, డివిజన్ ప్రచార కార్యదర్శి షేక్ షకీనా, డివిజన్ కార్యకర్తలు వీరాచారి, వాలురి వెంకటేశ్వర్లు, దారా ప్రవీణ్, వాలురి ఝాన్సీ, పాల్వంచ విజయ, గడ్డం శ్రీను, మెండే శ్రీను, పెమ్మసాని వెంకటేశ్వర్లు, రామాచారి, నాగయ్య, బోగ గిరీ, నాగ పద్మ, మణి, నాగమణి, లావణ్య, చాంద్ పాషా, తిరుమల్‌రావు, సోమసాయి, సురేందర్ చారి, అంగన్వాడీ టీచర్లు, ఆర్పిలు, ఆశావర్కర్లు, మరియు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.