Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఖమ్మం పట్టణంలో పర్యటించారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో వైరా మండలం గండుగుల పాడు గ్రామస్థులు వారి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రార్ధనా మందిరం వివరాలను పొంగులేటికి తెలుపగా వారికి స్థానిక నాయకులు రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు సమక్షంలో రూ. 25వేల అందజేశారు. అనంతరం స్థానిక ఎస్ఆర్ కన్వెన్షన్లో జరుగుతున్న అలేఖ్య అరున్ రెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. శాంతి లాడ్జిలో రిపోర్టర్ చారి కుమార్తె వివాహ నిశ్చితార్ధ మసూత్సవంలో పాల్గొని వధూవరులను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కార్పోరేటర్ దొడ్డా నగేష్, భీమనాధుల అశోక్ రెడ్డి, కానుగుల రాధాకష్ణ, దుంపల రవికుమార్, చింతమళ్ల గురుమూర్తి, కాంపాటి రమేష్, తంబి, యువనేత గోపి, నర్సింహారావు తదితరుతు పాల్గొన్నారు.