Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సమాజ మార్పుకు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. డివైయఫ్ఐ ఖమ్మం జిల్లా 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక యమ్పిడిఓ కార్యాలయంలో జెడ్పి సీఈఓ డి.వి అప్పారావు రఘునాదపాలెం తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, ఎంపీడీవోలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు షేక్ అబ్దుల్, జోనెబోయిన నవీన్, కడియాల పవన్, షేక్ నాగుల్ మీరా పాల్గొన్నారు.