Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన మేకల ఉపేందర్ గత సంవత్సరం కరోనా సోకి మృతిచెందాడు.ఉపేందర్ తిరుమలాయపాలెం పిఎసిఎస్‌లో సభ్యుడు కావడంతో శుక్రవారం నాడు పిఎసిఎస్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.50 వేల చెక్కును తిరుమలాయపాలెం పిఎసిఎస్ చైర్మన్, ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ చావా వేణు గోపాలకృష్ణ పిండిప్రోలు గ్రామంలోని ఉపేందర్ ఇంటికి వెళ్లి అతని భార్య సరస్వతికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో తిరుమలాయ పాలెం పీఏసీఎస్ సీఈవో శ్రీనివాస్‌రెడ్డి తదితరుల పాల్గొన్నారు.