Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
మాదక ద్రవ్యాల నివారణలో విద్యార్థులు భాగస్వామం కావాలని వైరా సి.ఐ. వసంత్ కుమార్ పిలుపు నిచ్చారు. శుక్రవారం సి.పి విష్ణు వారియర్ ఆదేశాల మేరకు స్థానిక మధు విద్యాసంస్థలకు చెందిన మధు విద్యాలయం, మధు జూనియర్ కళాశాల, మధు డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల నివారణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా సి.ఐ. వసంత్ కుమార్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలను సేవించి చెడు మార్గంలో పయనించడం వలన తమ భవిష్యత్తుకు, తమ కుటుంబాలకు, సభ్య సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. గంజాయిని పండించే వారికి, వినియోగించే వారికి శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల తయారీ, అమ్మకం, వినియోగం గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వేంటనే పోలీసు వారికి చెప్పాలని సూచించారు. విద్యార్థులు పూర్తి అవగాహనతో గంజాయి, ఇతర మారక ద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి సహకరించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించ వచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఎఎస్ఐ వీర వేంకట సత్యనారాయణ, మధు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రాంబాబు, మధు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.వి.ఆర్. చారి, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.