Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం గుట్టల బజారులో కొలువుదీరి అనేక ఏండ్లుగా భక్తుల కొంగుబంగారంలా విలసిల్లుతున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం నుండి 7వ తేదీ వరకూ వేడుకలు అత్యంత వైభవంగా జరుగను న్నాయని దేవాలయ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యందు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 7-15 ని. కు మంగళ వాయిద్యాలతో తోరణ బంధన, గ్రామ ప్రదక్షిణ, గోమాత పూజ దేవాలయ దర్శనం, దీక్షాధారణ, గణపతి పూజ, సాయంత్రం 4 గంటలకు యోగశాల పూజ మరియు ప్రధాన దేవతా హౌమములు జరుగునని రాత్రి 9 గంటలకు నీరాజనం మంత్రపుష్పములు జరుగునని, అంతేకాకుండా గాలిగోపురం ప్రతిష్ట మహౌత్సవం, గీతా మందిరం మరియు రామ మందిరం ప్రారంభం తదితర కార్యక్రమాలు జరిగునని దేవాలయ కమిటీ అధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వరావు తెలిపారు. దేవాలయం మహౌత్సవసభకు మహా సహస్ర అవధాని గరికిపాటి నరసింహారావు దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. కావున అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ ప్రారంభ మహా ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దేవత అనిల్‌కుమార్, కోశాధ్యక్షులు కొత్తమాసు హేమసుందర్ రావు, సలహాదారులు చెరుకూరి కృష్ణమూర్తి, చిన్ని కృష్ణారావు, కొప్పు నరేష్ కుమార్, దేవకి వాసుదేవరావు, రాయపూడి వెంకటరామారావు, నోముల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గెల్లా అమర్నాథ్, గొళ్ల భాస్కర్‌రావు, రాయపూడి వెంకటరమణ, సహాయ కార్యదర్శులు దుగ్గి శ్రీనివాసరావు, అనుమోలు రమేష్, చెరుకూరి సంతోష్ కుమార్, కుమ్మరి కుంట్ల శ్రీనివాసరావు, దేవర శెట్టి పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.