Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-మధిర
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయరంగానికి మొండిచేయి చూపి ఆ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మధిర బోడేపూడి భవనంలో జరిగిన పార్టీ సమావేశంలో నున్నా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పోరేట్లకు అనుకూలంగా ఉందని, ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనదన్నారు. కరోనా కాలంలో కూడా అన్ని రంగాలు నిర్వీర్యమైతే వ్యవసాయరంగం మాత్రమే రాష్ట్రలో అన్ని రంగాలను ఆదుకుందన్నారు. అలాంటి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఈ బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చటానికి బదులు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న బీజేపీపై పోరాటాలే నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు శీలం నర్సింహారావు, దివ్వెల వీరయ్య, పట్టణ మండల కార్యదర్శులు ఎం ఫణీంద్ర కుమారి, మంద సైదులు, పట్టణ కమిటీ సభ్యులు పడకంటి మురళి, రాధాకష్ణ పాల్గొన్నారు.