Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేష్
- రాయల భూలకీë జ్ఞాపకార్ధం కుటుంబసభ్యుల వితరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి నూతన వస్త్రాలు పంపిణీ చేయడం స్పూర్తిదాయకమని సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేష్ అన్నారు. పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులోని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు రాయల రామారావు సతీమణి రాయల భూలకీë 8వ వర్థంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధం మనవడు నురుకుళ్ల ధీరజ్ పారిశుధ్య కార్మికులకు సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేష్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు మాట్లాడుతూ కరోనా కాలంలో కార్మికుల సేవలు అభినందనీయమని, వారిని ఇలా సత్కరించుకోవడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.సుజాత, భూలకీë కుమార్తెలు, అల్లుళ్లు వెంకటేశ్వరరావు, చంద్రమోహన్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, సీనియర్ నాయకులు బాల బుచ్చయ్య, ఐద్వా నాయకులు పాకలపాటి ఝాన్సీ, తిగుళ్ల లకీë, మండూరి రవి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.