Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో మేడారం జాతరకు ఏర్పాటు చేసిన బస్సులను శుక్రవారం ఖమ్మం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలోమన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి డిపో నుంచి 35 బస్సులు మేడారం జాతరకు ఏర్పాటు చేశామన్నారు. ఏటూరునాగారం, చర్ల, వెంకటాపురం పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 30 మంది ప్రయాణికులు ఉంటే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. సత్తుపల్లి నుంచి మేడారంకు పెద్దలకు రూ.390, పిల్లలకు రూ.200గా టిక్కెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి గద్దెల దాకా చేరుకోవచ్చన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సమావేశంలో సత్తుపల్లి డిపో మేనేజర్ శ్రీహర్ష, అసిస్టెంట్ మేనేజర్ వి. గౌతమి, ఎంఎఫ్ శ్రీనివాసరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ జయరాజు పాల్గొన్నారు.