Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మునిసిపాలిటీ పాలకవర్గంలో ముసలం పుట్టింది. మొత్తం మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ ఇద్దరు, సీపీఎం ఒకరు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నారు. మిగిలిన 17 మంది టిఆర్ఎస్ సభ్యులే అయినా మునిసిపాలిటీలో తమకు గౌరవం లేదని, మునిసిపాలిటీ పాలన కౌన్సిలర్లకు సంబంధం లేకుండా నలుగురు వ్యక్తుల నిర్ణయం మేరకు సాగుతుందని కౌన్సిలర్ల ఆవేదన శుక్రవారం వైరా సాయిబాబా గుడి సమీపంలోని ఒక ఇంట్లో 16 మంది సభ్యులు రహస్యంగా సమావేశం నిర్వహించారు. మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని తీరు, ఏకపక్ష నిర్ణయాలపై ప్రశ్నించేందుకు 16 మంది కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. పై ముగ్గురి అవినీతిని ఎండగట్టాలని, కార్యాలయంలో తమకు గౌరవం ఇవ్వక పోవటం, తమ వార్డుల్లో జరిగే పనుల విషయం తెలపకపోవటం, ద్వజమెత్తాలని నిర్ణయించినట్లు తెలిసింది. గృహ నిర్మాణాల విషయం సెల్ఫ్ అసెస్మెంట్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిం చేందుకు, అక్రమ బిల్లుల వ్యవహారం తేల్చేందుకు, కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ఇస్తున్న పనులు, నిధుల విషమై జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశంలో వనమా విశ్వేశ్వరరావు, దనేకుల వేణు, డాక్టర్ డి.కోటయ్య, ఇమ్మడి రామారావు, గుడిపుడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.