Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమకేమి తెలియదంటున్న రైతు..పోలీసుల అదుపులో యువకులు
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం గిద్దవారిగూడెం-వెంకిట్యాతండా గ్రామాల మధ్యలోని జొన్న చేనులో గంజాయి చెట్లను పోలీసులు శుక్రవారం గుర్తించారు. గిద్దవారిగూడెం సమీపంలోని బీడులో కొందరు యువకులు అరుస్తూ, కేకలు వేస్తూ గలాటా చేస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన కడారి వెంకట్ అనే రైతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యువకులు మత్తులో తూలుతూ ఉండటంతో ప్రశ్నించగా యువకులు రైతు కడారి వెంకట్‌తో ఘర్షణకు దిగారు. దీంతో అతను మత్తులో తూలుతున్న యువకుల విషయాన్ని పోలీసులకు తెల్పాడు. కారేపల్లి ఎస్సై పీ.కుశకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్ళగా అప్పటికే రైతుతో యువకులు ఘర్షణ పడుతున్నారు. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పక్కనే గల జొన్న చేనులో తనిఖీలు చేయగా దాని మధ్యలో గంజాయి మొక్కలు గుర్తించారు. గంజాయి మొక్కల విషయాన్ని పోలీసులు సదరు రైతును ప్రశ్నించగా తనకేమి తెలియదని తెలిపారు. జొన్న చేనులో ఎవరు రారని గంజాయి మొక్కలను రైతుకు తెలియకుండా యువకులే నాటారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.