Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామం వద్ద రైల్వే మూడు లైన్ కోసం బోనకల్ మండల అర్ఐ సత్యనారాయణ, ఫీల్డ్ సర్వేయర్ పావని శుక్రవారం భూమి సర్వే నిర్వహించారు. రైతులు భూమిలో ఉన్న చెట్లను గ్రామ పంచాయితీకి సంబంధించిన విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, రైతులు బాగం నాగేశ్వరరావు, భాగం ప్రణీత్ నాయుడు, ఎన్ఆర్ఐ రాకేష్, సిపిఎం నాయకులు షేక్ ఖాశీం, గ్రామ పంచాయితీ వర్కర్ దార సురేష్, గ్రామ పంచాయితీ ఎలక్ట్రీషియన్ పోట్టపింజర గోపి, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.