Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్ మాతృమూర్తి సుశీలమ్మ పార్ధివ దేహాన్ని కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ సందర్శించి నివాళులు అర్పించారు. నివాళ్లర్పించిన వారిలో ఓబిసి జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు దొబ్బల సౌజన్య, తల్లాడ ఎంపిటీసి దగ్గుల రఘుపతి రెడ్డి, తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, దామాల రాజు, ఎంపిటీసి కోండురి కిరణ్ కుమార్, గోపిరెడ్డి, తోటకూరి శేషగిరిరావు తదితరులున్నారు.