Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మండల పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్డులోని తరుణిహట్ను కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం సందర్శించారు. ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతం ఖమ్మంలోని అద్దెభవనంలో నిర్వహిస్తున్నారని, వాటిని తరుణిహాట్ లోకి తరలించాలని కోరుతూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఇటీవల కలెక్టర్ గౌతమ్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ తరుణి హాట్ ను సందర్శించారు. తరుణి హాట్ పరిసరాలు మొత్తం పరిశీలించారు. తరుణిహట్కు
సంబంధించి మొత్తం భూమి ఎంత ఉంది,ఏయే నిర్మాణాలు ఉన్నాయి, ఏయే సంస్థలు తరుణిహట్
లో నిర్వహిస్తున్నారని పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరుణిహట్ ప్రాంగణంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(ఆర్ సెటీ)ని సందర్శించారు.శిక్షణతీసుకుంటున్న వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం, వసతి సౌకర్యాల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు, డీడీవో విద్యాచందన, పర్యాటకశాఖ అధికారి సుమన్ చక్రవర్తి, డిప్యూటీ తహసీల్దారు కరుణశ్రీ, ఎంపీడీవో అశోక్ కుమార్, ఎంపీవో శ్రీనివాసరావు, అధికారులు,సిబ్బందిపాల్గొన్నారు.