Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోన వైరస్ భారీ నుండి ప్రజలందరూ క్షేమంగా ఉండా లని వ్యాధి బాధల నుండి రక్షణ పొందాలని ప్రముఖ ప్రసంగీకులు రెవరెండ్ ఫాదర్ జయసన్ రక్షణ గిరి కొండ పైన సమిష్టి ప్రార్థనలు నిర్వహించారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామంలో గల రక్షణ గిరి పుణ్యక్షేత్ర తిరునాళు ముగిసినట్లు డైరెక్టర్ ఫాదర్ సూరే పల్లి హైజాక్ తెలిపారు.సంగీత ధ్వనులతో ఏసుక్రీస్తు ఊరేగింపు బస్ బస్టాండ్ నుంచి రక్షణ గిరి కొండ వరకు నిర్వహించారు. సాంస్కతిక కార్యక్రమాలు అందరిని అలరిం చాయి. పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అయ్యవారి గూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గోసు రా మారావు అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమాలలో కమిటీ సభ్యులు పెద్దలు, యూత్ సభ్యులు దళ సభ్యులు పాల్గొన్నారు.