Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్యదర్శిగా 'లింగయ్య' నియామకం
నవ తెలంగాణ - బోనకల్
బాల్ బ్యాట్మెంటన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గా బాల్ బ్యాడ్మింటన్ కోచ్ అమరేసి లింగయ్యను బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్రీనివాస్‌రావు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొంతు శ్రీనివాసరావు, వేజల్ల సురేష్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన వారు విడుదల చేశారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన అమరెసి లింగయ్య బోనకల్ గిరిజన కాలని, ముష్టికుంట్ల గ్రామాల నుంచి సుమారు 300 మంది బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేశాడు. నేడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బోనకల్ క్రీడాకారులదే అగ్రతాంబూలం.సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో బోనకల్‌కు చెందిన బాలికలు, బాలురు ఉండటం విశేషం. బోనకల్ కు చెందిన అనేక మంది క్రీడాకారులు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డులు, ప్లేయర్ ఆఫ్ అవార్డులు అందుకున్నారంటే ఆ ఘనత లింగయ్యదే. బాల్ బ్యాడ్మింటన్ క్రీడ కు లింగయ్య సుదీర్ఘకాలంపాటు అందిస్తున్న సేవలను ఎట్టకేలకు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. దీంతో లింగయ్యను జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గా నియమిస్తూ నియామక పత్రాన్ని లింగయ్య కు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందజేశారు. జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గా ఎంపికయిన లింగయ్య ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జెడ్పిటిసి సుధీర్ బాబు, బోనకల్ సర్పంచ్ బుక్యా సైదా నాయక్, శాంతి స్నేహ యూత్ అధ్యక్షుడు బోనకల్ సొసైటీ అధ్యక్షుడు, బోనకల్ మాజీ సర్పంచ్ చావా వెంకటేశ్వర రావు, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులు, అధికారులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.