Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని ఎస్ఐ తేజావత్ కవిత కోరారు. స్థానిక సాయిబాబా కళ్యాణ మండపంలో మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన సదస్సు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు అందకారంగా మారుతుందన్నారు. గ్రామాలలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై, వినియోగంపై తప్పనిసరిగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల విక్రయాలు వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి ఎం ఇందిరా జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు కూడా మాదకద్రవ్యాలకు బానిసగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రులు నిత్యం నిఘా ఉంచాలని కోరారు. సమావేశంలో ఏ ఎస్ ఐ దొండపాటి వెంకటనారాయణ, బోనకల్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం రత్నకుమారి, బోనకల్, రావినూతల, గోవిందాపురం ఏ, బ్రాహ్మణపల్లి, ఆళ్లపాడు, చిరునోముల, జానకిపురం సర్పంచులు బుక్యా సైదానాయక్, కొమ్మినేని ఉపేందర్, భాగం నాగేశ్వరరావు, జెర్రిపోతుల రవీంద్ర, మర్రి తిరుపతిరావు, ములకారపు రవి, చిలక వెంకటేశ్వర్లు రామాపురం ఎంపి టిసి ముక్కపాటి అప్పారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, పిఆర్టియు మండల అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, నాయకులు షేక్ హుస్సేన్ సాహెబ్, బంధం నాగేశ్వరరావు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.