Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విజయవంతం చేయాలి అ టీఆర్ఎస్ శ్రేణులకు కోరం పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హౌదాలో తొలిసారిగా జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు నేడు వస్తున్న సందర్భంగా కొత్తగూడెంలో ఘనసన్మానం ఏర్పాటు చేసినట్లు, జిల్లా సరిహద్దు గ్రామమైన జూలూరుపాడు, వినోబా నగర్ నుండి భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కొత్తగూడెం క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇరత ప్రజా ప్రతినిధిలు, పార్టీ నాయకలు, కార్యకర్తలు, రేగా అభిమానులు సన్మాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య కోరారు. శనివారం కొత్తగూడెం క్లబ్లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని పార్టీని ఉద్దేశించి సమావేశంలో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడనున్నారని కోరం తెలిపారు.