Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు ఎట్టి. లక్ష్మయ్య(85) ఆదివారం మృతి చెందారు. మృతదేహంపై పార్టీ పతాకాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి. కృష్ణ వేసి నివాళులర్పించి వారి కుటుంబాని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమరజీవి కామ్రేడ్ ఏలూరి.లక్ష్మీ నారాయణ తో కలిసి పోడు భూములు,వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసిన వ్యక్తి లక్ష్మయ్య పార్టీ సిద్దాంతలకు కట్టుబడి పేదలకోసం న్యాయం కోసం పోరాటం చేశారు. మృతునికి ఒక కుమారుడు ఇరువురు కుమార్తే కలరు. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు, అనంతరాములు, సాంతయ్య, నాగభూసి, భావుసింగ్, రామక్రిష్ణ, బాబు పాల్గొన్నారు.