Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
వైరా మండలం కొష్టాల గ్రామంలో సిపిఐ(ఎం) పార్టీ సానుభూతి పరురాలు మద్దెల అపరంజమ్మ ఆదివారం అనారోగ్యంతో మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరవు మద్దెల అపరంజమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీరితోపాటు మండల కమిటీ సభ్యులు మద్దెల బాబురావు, కొష్టాల గ్రామ సర్పంచ్ మంచాల జయరావు, శాఖ కార్యదర్శి ఏమి మోహనరావు, సభ్యులు రామాల కృపానందం, నాయకులు కొండలరావు, శరత్, బాబురావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు నివాళులు అర్పించారు.