Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ సెంటర్ లో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తొలుత మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంజీవరెడ్డి భవన్ నుండి ర్యాలీగా వచ్చి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముక్క శేఖర్ గౌడ్, వడ్డే నారాయణ రావు, ఏలూరు రవి , దేవత శంకర్ నాయక్. రబ్బానీ , 57వ డివిజన్ కార్పొరేటర్ రఫీదా బేగం పాల్గొన్నారు.
మధిర : రాజ్యంగం పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలుకు నిరసనగా మధిర మండలం పరిధిలోని మాటూరులో విద్యానగర్ కాలనీ ఎంఆర్పీఎస్, అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో హౌరెత్తిన నిరసనతో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ యువజన సంఘం యూత్ ప్రెసిడెంట్ రవి పాల్గొన్నారు.