Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలోని గుట్టల బజారులో కొలువుదీరి, భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతున్న విశ్వమాత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ మహోత్సవాల సందర్భంగా ఆదివారం రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజరు కుమార్ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీ వాసవీమాత విశ్వమాతగా ఎలా అవతరించారు, లోక కల్యాణం కోసం ఆమె ప్రాణ త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, దేవాలయ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్, భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్, దేవాలయ కమిటీ గౌరవ సలహా దారులు చెరుకూరి కృష్ణమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, దేవాలయ పాలకమండలి కోశాధికారి కొత్తమాసు హేమసుందర రావు, పాల్గొన్నారు.