Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోనకల్ :జిల్లా వ్యాప్తంగా జిటి త్రిబుల్ యస్ సేవలు మరువలేనివని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సర్పంచ్ వెంకట నరసమ్మ అన్నా రు. బోనకల్ మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో ఖమ్మంకు చెందిన జిటి త్రిబుల్ ఎస్ సంస్థ ఎస్టి కాలనీలో యూసిఎం చర్చి వద్ద నూతనంగా వేసిన చేతి పంపును వారు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనకల్ చర్చిచి ఫాదర్ ఎర్నెస్ట్ పాల్ మండల వ్యాప్తంగా నీటి సమస్య ఉన్న అనేక గ్రామాలలో బోర్లను వేయించారన్నారు. జీటీ త్రిబుల్ ఎస్ సంస్థ మండలంలో గల అన్ని గ్రామాలలో బోర్లు వేశారన్ననారు. ఈ కార్యక్రమంలో బోనకల్ చర్చి ఫాదర్ బుంగ ఎర్నెస్ట్ పాల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.