Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ తాతా మధుకు ఘన స్వాగతం
అ కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు : కందాళ
అ నాకు రాజకీయ చైతన్యం కల్పించిన
పిండిప్రోలు కు రుణపడి ఉంటా - ఎమ్మెల్సీ
నవతెలంగాణ - తిరుమలాయపాలెం,
ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తొలిసారి తన స్వగ్రామం పిండిప్రోలులో అడుగుపెట్టిన తాతా మధుసూదన్ కు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,గ్రామస్తులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. బాజా భజంత్రీలు, బాణా చంచా మోతలతో గ్రామం దద్దరిల్లింది. ఓపెన్ టాప్ జీప్ పై పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణంతో ఎమ్మెల్సీ తాతా మధు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత వేదికపై బ్రామణొత్తములు ఆశ్వీర్వదించనాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కి చేసిన సేవలను గుర్తించి తాతా మదుకు ఎమ్మెల్సీగానే కాకుండా పార్టీ అధ్యక్షునిగా నియమించారు. పిండిప్రోలులో ఉన్న సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. అన్ని వర్గాలకు ప్రజలకు న్యాయం చేసేవిధంగా తాత మధుతో కలిసి సమిష్టిగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ నాకు రాజకీయ చైతన్యం కల్పించి నలుగురిలో నన్ను ఒకడిగా నిలిపిన పిండిప్రోలు గ్రామప్రజలకు రుణపడి ఉంటానన్నారు. నాపై నమ్మకంతో ఈ పదవులను ఇచ్చిన సిఎం కెసిఆర్కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కెసిఆర్ తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లోనే తిరుమలాయపాలెం సస్యశ్యామలంగా మారింది. చామకకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, డీసిసిబి డైరెక్టర్లు చావా వేణుగోపాలకృష్ణ, తెరాస మండల అధ్యక్షులు భాష బోయిన వీరన్న, ఎంపీపీ బోడా మంగీలాల్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, టీఆర్ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, సిపిఎం గ్రామ కార్యదర్శి పప్పుల ఉపేందర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు చామకూరి శ్రీనివాస్ రావు, జాల కిరణ్, లక్ష్మయ్య, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.