Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు
నవతెలంగాణ- సత్తుపల్లి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన ్ఆర్ఈజీఎస్) పథకం ద్వారా సత్తుపల్లి మం డలం సదాశివునిపాలెం, పాకలగూడెం గ్రామాల్లో రూ. 30లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభించారు. పాకలగూడెంకు రూ. 20లక్షలు, సదాశివునిపాలెం రూ. 10లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, పాకలగూడెం సర్పంచ్ దుగ్గిరాల వాణిశరత్, పాకలగూడెం సర్పంచ్ తుంబూరు సరస్వతి, ఎంపీటీసీ సభ్యులు పిడుగు సత్యనారాయణ, ఉప సర్పంచ్ కాల్నేని వెంకటేశ్వరరావు, నాయకులు దొడ్డా శంకరరావు, మోరంపూడి రవి పాల్గొన్నారు.