Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎర్రుపాలెం భూదాన్ రైతులకు న్యాయం
అ జిల్లాలో 15,583 క్లయిమ్ ల పరిష్కారం
అ ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ధరణీ పోర్టల్ సేవల ద్వారా ఖమ్మం జిల్లాలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామరైతులకు ఇటీవలే నూతన పాస్ పుస్తకాలు జారీచేయడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. 'ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో సర్వేనెం. 58లో 1977 వ సంవత్సరంలో భూదాన్ భూమి 313 ఎకరాలను 75 మంది రైతులకు పంపిణీ చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. 2018లో భూ రికార్డుల నవీకరణలో ఆ రైతుల భూములు నిషేధిత జాబితాలోకి చేర్చారు. ఈ కారణంగా పాస్ పుస్తకాల జారీ నిలిచిపోయింది. అప్పటి నుండి ఆ రైతులు పాస్ పుస్తకాలకోసం నిరీక్షిస్తున్నారు. ఈ విషయమై భూదాన్ యజ్ఞ బోర్డు నుండి అప్పటి ఉత్వర్వుల ప్రతులను తెప్పించాం. పాతపుస్తకాలు కలిగిన రైతులు, చనిపోయిన రైతుల వారసులకు రికార్డుల ఆధారంగా రెవెన్యూ యంత్రాంగంతో పరిశీలన చేయించి 197 ఎకరాలకు గాను ఎస్సీ, ఎస్టీ, బి.సి రైతులు 86 మందికి నూతన పాస్ పుస్తకాలను అందించాం.' అని వివరించారు. దాదాపు మూడున్నర సంవత్సరాల కాలంగా అపరిష్కతంగా ఉన్న భూ సమస్యలను ధరణీతో పరిష్కరిం చినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణీ పోర్టల్ సేవల ద్వారా జిల్లాలో 15,947 క్లయిమ్ లకు 15,583 పరిష్కరించామని తెలిపారు. వాటిలో దాదాపు 10 వేల పెండింగ్ మ్యూటేషన్లు ఉన్నాయన్నారు. 646 ఎల్-ఫారంలు, 4,135 గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్, 205 సక్సెషన్ విత్ అవుట్ పి.పి.బి, 103 ఆధార్ సీడింగ్స్, 57 కోర్టు కేసులకు సంబంధించిన పి.పి.బిల జారీ, 7416 పి.ఓ.బి దరఖాస్తులను పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. సుమోటోగా స్వీకరించిన 68,361 సర్వే నెంబర్లకు సంబంధించిన 89,600 ఎకరాల విస్తీర్ణంకుగాను 5,267 సర్వే నెంబర్ల కు చెందిన 67,637 ఎకరాల విస్తీర్ణాన్ని ఆమోదించామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ సేవలు, నూతన రెవెన్యూ చట్టం అమలు ద్వారా జిల్లాలో వ్యవసాయ భూ క్రయ-విక్రయాలు పూర్తి పారదర్శకంగా కొనసాగు తున్నాయని తెలిపారు. తహశీల్దార్లు సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ స్లాట్ బుకింగ్ అయిన 16,426 సేల్ రిజిస్ట్రేషన్స్, 9,606 గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, 11 వందలు నాలా కన్వర్షన్స్ దరఖాస్తులను పరిష్కరించి వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసి డాక్యుమెంట్లను సంబంధిత యజమానులకు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.