Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్‌కు పితృవియోగం కలిగింది. కొండపల్లి వెంకటేశ్వరరావు (80) ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవి విరమణ పొందారు. పార్టీ సానుబూతి పరులైన ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కార్మికుల పక్షాన సీఐటీయూ నుండి నాయకత్వం వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మంచికంటినగర్‌లో ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు జాటోత్ కృష్ణ, దొడ్డారవికుమార్, అన్నవరపు నారాయణ, భూక్యా రమేశ్, లక్కి బాల్‌రాజు, మెరుగు ముత్తయ్య, ఎస్ లకిë, సత్య, వాణి, తదితరులు నివాళులుఅర్పించారు.