Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేను రంగంలో నిలబడితే
వారు పారిపోతారు
అ ప్రజలు నన్నే కోరుకుంటున్నారు
అ మీడియా చిట్‌చాట్‌లో
మాజీ ఎమ్మెల్యే జలగం
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు నేను కావాలని, నన్ను రావాలని కోరుకుంటున్నారని, ప్రజల మధ్యన లేకున్నా...అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, నేను రంగంలో నిలబడితే నా వ్యతి రేకులు పారిపోతారని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. ఆదివారం లక్ష్మీదేవిపల్లిలో విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడు తూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కొత్తగూ డెం నుంచి పోటీ చేస్తా...అని స్పష్టం చేశారు. నియో జవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశానన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కాలేదని...తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పుకోడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. తమకు ఓటమి ఇవి కారణాలు అయి ఉంటాయని అన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల యోగ క్షేమాల కోసం నిరంతరం తమ వంతు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్చాలన్న మాటకు ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం చూస్తే హాస్యా స్పదంగా ఉందన్నారు. రాజ్యాంగం రచించే సమ యం నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజ్యా ంగం రచించారని, ప్రస్తుతం మారుతున్న తరానికి, పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం మార్చు కోవడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. ఏపార్టీ నుండి పోటీచేస్తారన్న ప్రశ్నను దాటవేశారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా నియో జక వర్గంలో పర్యటిస్తున్నానని తెలిపారు. రేగా కాం తారావు సన్మాన కార్యక్రమంపై మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రేగాకు అభినందనలు తెలిపా నని, కార్యక్రమానికి వస్తే నాకు వ్యతిరేకులుగా ఉన్న వారు కార్యక్రమం నుండి పారిపోయో పరస్థితి ఉం టుందన్న ఉద్దేశ్యంతో కార్యక్రమానికి రాలేక పోయా నని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమసయంలో ప్రారంభించిన అనేక అభివృద్ది పనులను పరిశీలించానని, కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు.