Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పలువురు కార్మిక సంఘ నాయకులు ఘననివాళి
నవతెలంగాణ-పాల్వంచ
సుదీర్ఘకాలం విద్యుత్ కార్మికులకు అమూల్యమైన సేవలు అందించిన 1104 యూనియన్ మాజీ అధ్యక్షులు శ్రామిక జీవి ఎస్.జంగయ్య (79) పరపదించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన కాంట్రాక్టర్స్ కాలనీలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం మరణించారు. భ్యానగరంలోని బేగంపేటలో శ్రామిక కుటుంబంలో మల్లమ్మ నాగయ్యగౌడ్ పుణ్యదంపతులకు జన్మించిన ఆయన ఉన్నత విద్యనభ్యసించకపోయినా ఉన్నతమైన ఆశయాలతో అంకితభావంతో అంకుటిత దీక్షతో ముందుకెళ్లారు. పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్‌లో 1964లో జూన్ 1న ఉద్యోగంలో చేరిన ఆయన 2001లో పదవి విరమణ పొందారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్‌కు రాష్ట్ర అద్యక్షులుగా 2 పుష్కరాల కాలం సేవలందించి రాష్ట్రంలో అత్యంత గౌరవం గల కార్మికుడిగా గుర్తింపు పొందారు. తొలుత ఆ యూనియన్‌కు మార్గనిర్ధేశాలు ఏర్పరిచి రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్ది యూనియన్ అభ్యున్నతికి కృషి చేశారు. కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యంతో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ పోరాడి పరిష్కరించారు. ఆయన మృతిపట్ల కార్మిక సంఘ నాయకులు ప్రగాఢ సానుబూతిని వ్యక్తం చేస్తూ ఆయన మృతి కార్మికలోకానికి తీరని లోటని అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబానికి ప్రగాఢ సానుబూతిని తెలియ జేశారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో 1104 రాష్ట్ర నాయకులు, జంగయ్య కుమారుడు, సుధీర్, కోటేశ్వరరావు, రాజేందర్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అంకిరెడ్డి నర్సింహరావు, బిటిపిఎస్ నాయకులు వీరస్వామి, సాంబశి వరావు, శేషయ్య, 1535 యూనియన్ నాయకులు వజీర్, రాధాకృష్ణ, రాము, వెలదండి ప్రసా ద్,దానయ్య, ఎఐటియుసి నాయకులు మురళి, టిఆర్వికేఎస్ రాష్ట్ర నాయ కులు చారుగుండ్ల రమేశ్, కట్టా మల్లిఖార్జున్‌రావు, 142 యూనియన్ నాయకులు బొల్లేపొగు రవి, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎడవల్లి కృష్ణ, పట్టణ అద్యక్షులు రంగారావు తదితరులు సంతానం తెలియజేశారు.