Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన
వారిని ఆదుకోవాలి
అ న్యాయం జరిగే వరకూ
పోరాటం తప్పదు
అ సీపీఐ(ఎం) నాయకులు కాసాని
నవతెలంగాణ-సుజాతనగర్
తిప్పనపల్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం కోసం పోరాటం చేస్తామని, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం తప్పదని సీపీఐ(ఎం) నాయకులు కాసాని అయిలయ్య స్పష్టం చేశారు. ఆదివారం సుజాతనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 28వ తేదీన చండ్రుగొండ మండలం, తిప్పన పల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సుజాతనగర్ మండలం హరిజనవాడ గ్రామానికి చెందిన ప్రతి పేద దళిత కుటుంబాలకు రూ.25 లక్షలఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 13 మందికి అంగవైకల్యం, గాయాలైన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించే వరకు పోరాటం చేయటానికి సిద్దం అని తెలిపారు. గత నెల జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజరు కుమార్‌కి బాధిత కుటుంబాల నుండి మెమోరాండం ఇద్దామని ప్రయత్నం చేసినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర మంత్రులు పేద దళిత కుటుంబాలను అవమానపరిచే విధంగా చేశారని మండి పడ్డారు. కలెక్టర్‌ను కలిసినప్పుడు కూడా కలెక్టర్ స్పందించకుండా దళితులను అవమానించే తీరుగా వ్యవహరించారని ఆరోపించారు. చనిపోయిన కుటుంబాలను కనీసం చూడటానికి కూడా కలెక్టర్‌గాని, ఇదే మార్గంలో ప్రయాణించిన మంత్రులిద్దరూ దెబ్బలు తగిలి గాయాలతో ప్రభుత్వ హాస్పటల్లో ఉన్న పేద దళితులను పరామర్శించకుండా వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్‌ను కలిసినప్పుడు దళితులని కూడా చూడకుండా అవహేళన చేసే పద్ధతిలో ఉన్నారని ఆరోపించారు. బాధిత దళిత కుటుంబాలకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధ పడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్కిరాల శ్రీను, గుర్రం నరేందర, కత్తి రాములు, కత్తి నరసింహారావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వీర్ల రమేష్, నర్రా శివరామ కృష్ణ, గండమాల భాస్కర్, బానోత్ లక్ష్మణ్, బచ్చలకూర శ్రీను, కొండె కృష్ణ, కాట్రాల తిరుపతిరావు, నల్లగొండ పుల్లయ్య, భూక్య శంకర్, బాల వెంకటేశ్వర్లు, కత్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.