Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కుమారుడు తులసిరామ్
నవతెలంగాణ-చండ్రుగొండ
మండలంలోని పోకల గూడెం గ్రామ పంచాయతీలోని బాల్య తండా గ్రామానికి చెందిన భూక్యారామచందు (50) రైతు 6 ఎకరాలు (మూడు ఎకరాలు సొంతం మూడు ఎకరాలు కౌలు) మిర్చి తోటవేయగా మిర్చి సరిగా పండక పోవడంతో (సుమారు పది లక్షల నష్టం) రావడంతో శనివారం తోటకి వెళ్ళిన రామచందుకు సడన్‌గా బ్రెయిన్ స్ట్రోక్ రాగా అతని కొడుకు తులసీరామ్ కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆయనను పరిశీలించి వెంటనే ఖమ్మం తీసుకెళ్లాలని సూచించగా ప్రైవేట్ అంబులెన్స్‌లో ఖమ్మం తీసుకెళ్లే క్రమంలో జూలూరుపాడు మండలం వినోబానగర్ దగ్గర శనివారం రేగా కాంతారావు జిల్లా అధ్యక్షుడిగా నియమితులై కొత్తగూడెం వస్తున్న సందర్భంగా పోలీస్ అధికారులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ రామ చందు ఉన్న అంబులెన్స్‌ను 20 నిమిషాలు ఆపారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఖమ్మం మమత హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా ఆదివారం ఉదయం మృతి చెందాడు. శనివారం అంబులెన్స్‌ను 20 నిమిషాలు ఆపకుండా ఉన్నట్లయితే మా నాన్న బతికే వాడిని తులసీరామ్ ఆరోపించాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు.