Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే రాములు నాయక్
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో కాంట్రాక్టు కార్మికులే కీలక పాత్ర వహిస్తున్నారని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. ఆయన చేతుల మీదగా ఆదివారం కేటీపీయస్ విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏ-238) టీఈఈయూ (హెచ్-142 అనుబంధం) రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రామారావు ఎమ్మెల్యేను శాలు వాతో సత్కారించి జ్ఞాపినను బహుకరించారు. ఈ కార్యక్రమంలో (ఏ-238) అధ్యక్ష, కార్యదర్శులు భూక్యా లక్ష్మణ్ నాయక్, బొందెల శ్రీనివాసరావు, పవన్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.