Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం ప్రజలకు అందని ద్రాక్షగా మిగులనుందని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సందేహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక మంచికంటి భవన్లో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో పాత కొత్తగూడెం ఏరియాలో 2017లో ప్రభుత్వం సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా సాధించిన 40 ఎకరాల భూమిలో డబుల్ బెడ్రూం కడతామని హామీ ఇచ్చింది. అలాగే రెండు దఫాలుగా ప్రజల దగ్గర నుండి డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు మూడు వేల మంది డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం నేటికీ డబుల్ బెడ్రూం నిర్మాణం పూర్తి చేయడం గాని, లబ్ధిదారులను ఎంపిక చేయడం పట్ల గాని చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. 2019 నాటికి పూర్తయి ప్రజల చేతికి ఇవ్వాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నేటికీ పూర్తి కాకపోవడం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే అని విమర్శించారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి ఆసరాగా నిలుస్తుందని అనుకున్న డబుల్ బెడ్ రూమ్ కలగానే మిగిలి ఉందన్నారు. ఎమ్మెల్యేలు మారి నప్పుడల్లా దరఖాస్తులు పెట్టించు కుంటున్నారే తప్ప ఇండ్లు మాత్రం మంజూరు చేయడం లేదని విమ ర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పం దించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న క్రమబద్ధీకరణ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని, తూతూమంత్రంగా ప్రచార కార్యక్రమం కోసం కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి వదిలేశారని ఆయన విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి కొత్తగూడెంలో క్రమబద్ధీకరణ పట్టాల సమస్యను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ పోరాటాలకు సిద్ధం అవుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాల రాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, పట్టణ కమిటీ సభ్యులు సందకూరి లక్ష్మి, డి.వీరన్న, కర్ల వీరస్వామి, ఆవుల శ్రీరాములు, అప్పికట్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.